గ‌ణ‌ప‌తి ల‌డ్డూ చోరీ.. ఎత్తుకెళ్లిన పిల్ల దొంగ‌లు

-ప‌ది మందికి పంచితే దోషాలు పోతాయ‌ని..
-డ‌బ్బు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో దొంగ‌త‌నం

The theft of the laddu in Ganesha’s hand: గ‌ణేషుడి చేతిలో ల‌డ్డూ ప‌ది మందికి పంచితే దోషాలు పోతాయి.. డ‌బ్బు వ‌స్తుంది.. ఇదీ ఓ మ‌హిళ న‌మ్మ‌కం. దీంతో ఆ ల‌డ్డూ దొంగ‌త‌నం చేసేందుకు కొడుకుని పుర‌మాయించింది. ఎనిమిది సంవ‌త్స‌రాల ఆ బాలుడు ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి దొంగ‌త‌నం చేశారు.

వినాయక చవితికి గ‌ణేషుడి చేతిలో ఉండే ల‌డ్డూ ఎంత స్పెష‌లో అంద‌రికీ తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు పూజ‌లందుకునే ఆ ల‌డ్డూ ద‌క్కించుకునేందుకు ఎంతో మంది పోటీ ప‌డుతుంటారు. ఎంత డ‌బ్బు పెట్టేందుకయినా వెన‌కాడరు. ఏకంగా ఆ ల‌డ్డూనే మాయం చేశారు. చిన్నారులు కొంద‌రు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ సమీపంలోని పావని హోమ్స్‌లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వాహకులు పది కిలోల లడ్డూ ఉంచగా.. ఫిలింగనర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన పిల్లలు ఆ లడ్డూని చోరీ చేశారు.

ఉదయం దేవుడి చేతిలో లడ్డూ కనిపించకపోవడంతో నిర్వాహకులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి.. అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎమ్మార్సీ కాలనీకి చెందిన ఒక మహిళ కుమారుడు మరో ఇద్దరు పిల్లలతో కలిసి లడ్డూ తీసుకుని పరారైనట్లు గుర్తించారు. ఎనిమిదేళ్ల వయస్సున్న ఆ పిల్లాడిని లడ్డూ ఎందుకు తీసుకెళ్లావంటూ విచారించగా.. తన తల్లి చెప్పడంతోనే దొంగతనం చేసినట్లు తెలిపాడు. దాంతో నిర్వాహకులు చోరీకి పాల్పడిన ముగ్గురు పిల్లలను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like