మూడు రోజులు కేసీఆర్ జ‌న్మ‌దిన సంబురాలు

పార్టీ శ్రేణుల‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

మంచిర్యాల : తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు జ‌న్మ‌దిన సంబురాలు మూడు రోజుల పాటు నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మూడు రోజులు వివిధ సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక సంబరంగా జరుపుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15,16,17 తేదీల్లో ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ అన్నారు.

ఈ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు:

ఈనెల 15వ తేదీ- రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు
(ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు)

– 16 తేదీ – అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు

– 17 తేదీ కేసీఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు

ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like