రెండు రోజులు తిరుమ‌ల ఆల‌యం మూసివేత‌

Tiruma‌la tirupa‌ti dēva‌sthānaṁ: పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం మూసివేయ‌నున్నారు. ఈనెల 28 రాత్రి 7.05 గంటలకు ఆల‌యాన్ని మూసివేస్తారు. 29న ఉద‌యం 3.15 గంటలకు ఏకాంత శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులను తెరుస్తారు. ఈ నెల 28న రాత్రి 1.05 నుంచి 29వ తేదీ తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్ర గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like