ట‌మాట రైతు హ‌త్య

పంట డబ్బు కోసం హ‌త్య చేసిన దుండ‌గులు

Tomato: ట‌మాట ధరకు రెక్కలు వచ్చాయి. కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. దీంతో కొన్నేళ్లుగా నష్టపోతున్న ట‌మాట రైతులు ఇప్పుడిప్పుడే కొంత లాభాలు చూస్తున్నారు. అదే టమాటా ధర ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బోడిమల్లదిన్న గ్రామానికి చెందిన నారెం రాజశేఖర్ రెడ్డి టమాటా పండిస్తుంటాడు. ఊరికి దూరంగా తన వ్యవసాయ పొలంలోనే నివాసముంటూ సాగుచేస్తున్నాడు. తన పొలంలో టమాటా సాగు చేయగా.. పంట బాగా పండింది. ఇప్పటికి ఐదు కోతలకు కోసి పంటను అంగళ్లు మార్కెట్లో విక్రయించాడు. మంగళవారం 70 క్రేట్ల టమాటాలను మార్కెట్లో అప్పజెప్పాడు రాజశేఖర్ రెడ్డి. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులుంటాయని భావించి వాటి కోసమే హత్య చేశార‌ని పోలీసులు చెబుతున్నారు.

భర్త ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భార్య జ్యోతికి అనుమానం వచ్చింది. ఆమె తమ కుమార్తెలకు సమాచారం ఇచ్చింది.. వారు ఫోన్‌ చేయగా ఎవరూ ఎత్తలేదు. ఈ విషయం తెలియడంతో రాజశేఖర్‌రెడ్డి బంధువు వెతుక్కుంటూ వెళ్లారు.. దారి మధ్యలో బైక్, మొబైల్ ప‌డి ఉండటాన్ని గమనించి చుట్టుపక్కల వెతికారు. ఇంతలో చింత చెట్టు కింద చేతులు, కాళ్లు కట్టేసి రాజశేఖర్ రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like