చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు..

-చంద్రుడిపై కొనసాగుతోన్న చంద్రయాన్-3 పరిశోధన
-దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్‌
-సిలికాన్, టైటానియమ్, కాల్షియం వంటి మూలకాలు
-సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఇస్రో

Chandrayaan-3:అంత‌రిక్ష ర‌హ‌స్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్ ముందుకు సాగుతోంది. మాన‌వుడికి అంతుప‌ట్ట‌ని ఎన్నో ఖ‌గోళ ర‌హ‌స్యాల‌ను చేధించ‌ని వాటిని బ‌య‌ట‌పెడుతూ చంద్ర‌యాన్ 3 విజ‌య‌వంతంగా త‌న ప‌ని చేస్తోంది. ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని ప్రజ్ఞాన్ రోవర్ సేకరిస్తోంది. చంద్రుడిపై ఆగస్టు 23న విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి అన్వేషణ చేస్తోంది. ఈ క్రమంలో చంద్రుడిపై ఎన్నో మూల‌కాలు ఉన్న‌ట్లు గుర్తించింది. ఇందులో కీల‌క‌మైంది ఆక్సిజన్ సైతం ఉన్న‌ట్లు బ‌య‌ట‌పెట్టింది. ఇస్రో ప్రకటనతో చంద్రుడిపై మనిషి మనుగడకు అవసరమైన ప్రాణ వాయువు ఉంటుందనే ఆశలు చిగురిస్తున్నాయి.

చంద్రయాన్-3 (Chandrayaan-3) అప్ర‌హ‌తిహ‌త విజ‌య‌యాత్ర సాగుతోంది. ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని ప్రజ్ఞాన్ రోవర్ సేకరిస్తోంది. ఈ క్రమంలో చంద్రుడిపై ఆక్సిజన్ (Oxygen) ఆనవాళ్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్ర‌క‌టించింది. చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై మాంగనీస్ (Fe), టైటానియం (Ti), కాల్షియం (Ca), సల్ఫర్ (Fe), క్రోమియం (Cr), అల్యూమినియం (Al), సిలికాన్ (Si) వంటి మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్‌లో అమర్చిన లేజర్ -ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) మొదటిసారిగా ధ్రువీకరించిందని పేర్కొంది. హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగుతోందని వివరించింది.

జాబిల్లి ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే.. 80 మి.మీల లోతులో మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్‌లోని పేలోడ్ చాస్టే గుర్తించింది. ల్యాండింగ్‌ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 20- 30 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చంద్రుడి ఇంత వరకూ చల్లనివాడే అనుకున్న అంచనాలు తప్పని తేలింది. చంద్రుడిపై కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నట్టు తాజాగా వెల్లడయ్యింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like