భార‌త్ జోడో యాత్ర‌లో విషాదం…

గుండెపోటుతో ఎంపీ మృతి

Tragedy in Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్‌సింగ్ గుండెపోటుతో మృతిచెందారు. దీంతో రాహుల్ పాద‌యాత్ర ఆపేసి హుటాహుటిన ఆసుప‌త్రికి చేరుకున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్‌లో సాగుతోంది. శనివారం ఉదయం లాథోవల్ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోక్‌సింగ్ రాహుల్ గాంధీతో పాటు నడుచుకుంటూ వెళ్తుండ‌గా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయ‌న‌ను ఫగ్వారాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన చనిపోయినట్టుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.

సంతోక్‌సింగ్ మరణించారనే విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ.. యాత్ర నుంచి బయలుదేరి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంపీ సంతోక్‌సింగ్ మృతిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like