9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

Transfer of IAS officers: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, జనగామ అడిషనల్ కలెక్టర్ గా లలిత్ కుమార్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధికాగుప్త, సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా పి.గౌతమి, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి. శ్రీజ, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ గా లెనిన్ వత్సాల్, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ గా సివేంద్ర ప్రతాప్, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ గా కదీవరన్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత్ ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరగనున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like