కలెక్టర్ బదిలీ..జిల్లాలో సంబురాలు

Komurambheem Asifabad: కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంబురాలు చేసుకొన్నారు. జిల్లా కేంద్రంలోనీ ప్రధాన రహదారిపై పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్థానిక ప్రజల సమస్యల గురించి అలసత్వం వహించారని దుయ్యబట్టారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులకే వత్తాసు పలికారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్నీ బదిలీ చేయాలనీ ఆందోళనలు సైతం చేశామని వెల్లడించారు. బదిలీ పై ఇక్కడకు వచ్చే కలెక్టర్ అయినా ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like