ప‌లువురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల బ‌దిలీ

Transfer of several Deputy Collectors:ప‌లువురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. సంగారెడ్డిలో విధులు నిర్వ‌హిస్తున్న ఎం.న‌గేష్‌కు జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. నారాయ‌ణ్‌ఖేడ్‌లో ప‌నిచేస్తున్న అంబ‌దాస్ రాజేశ్వ‌రికు మెద‌క్ ఆర్డీవోగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌హీరాబాద్ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న ఎస్‌.ర‌మేష్‌బాబు సిద్దిపేట ఆర్డీవోగా బ‌దిలీ చేశారు. హుజూర్‌న‌గ‌ర్‌లో ఆర్డీవోగా ప‌నిచేస్తున్న వెంక‌ట్‌రెడ్డిని జ‌హీరాబాద్‌కు బ‌దిలీ చేశారు. ఉట్నూరు ఎస్‌డీసీ (ట్రైబ‌ల్ వెల్ఫేర్‌)గా ప‌నిచేస్తున్న సీహెచ్‌.ర‌వీంద‌ర్‌రెడ్డిని సంగారెడ్డి ఆర్డీవోగా బ‌దిలీ చేశారు. సీసీఎల్ఏలో అసిస్టెంట్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేస్తున్న బెన్‌షాలోమ్‌ను హుస్నాబాద్ ఆర్డీవోగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. గోదావ‌రిఖ‌ని(సింగ‌రేణి) లాండ్ అసైన్‌మెంట్ విధులు నిర్వ‌హిస్తున్న కే.న‌ర్సింహ‌మూర్తిని ఆర్డీవోగా నారాయ‌ణ్‌ఖేడ్ బ‌దిలీ చేశారు. న‌ల్గొండ‌లో ఆర్డీవోగా ప‌నిచేస్తున్న జ‌య‌చంద్రారెడ్డిన తూప్రాన్ ఆర్డీవోగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దేవ‌ర‌కొండ ఆర్డీవోగా ప‌నిచేస్తున్న గోపీరాం ఆంథోల్ ఆర్డీవోగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆర్మూరులో ఆర్డీవోగా చేస్తున్న వీ.శ్రీ‌నివాసులును న‌ర్సాపూర్ ఆర్డీవోగా బ‌దిలీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like