త్రివిధ ద‌ళాల్లో చేరేందుకు యువ‌త‌కు అవ‌కాశం

-అగ్నిప‌థ్ పేరుతో రిక్రూట్‌మెంట్
-నాలుగేండ్ల పాటు సేవ‌లందించే అవ‌కాశం

త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సాయుధ బాలగాల నియామక ప్రక్రియలో నూతన విధానం తీసుకొచ్చింది. ఆర్మీ(Army)లో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో… అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ ప‌థ‌కాన్ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్ర‌క‌టించారు. యువ‌త‌ను భార‌త త్రివిధ ద‌ళాల్లో చేర్పించుకునేందుకు ఏర్పాటు చేసిన ప‌థ‌కమే ఈ అగ్నిప‌థ్ ల‌క్ష్యం. దీని కింద నాలుగేండ్ల పాటు సేవ‌లు అందించాల్సి ఉంటుంది.

రిక్రూట్ మెంట్ స్కీమ్ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప‌థ‌కం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఉద్యోగం కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో అగ్ని వీర్లకు ఆకర్షణీర్షయమైన జీతం లభిస్తుంది. నాలుగు సంవత్సరాల త‌రువాత ప్యాకేజీ రూపంలో న‌గ‌దును అంద‌జేస్తారు. అయితే ఇందులో ప‌ని చేసి వ‌చ్చిన వారికి వివిధ ఉద్యోగాల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తారు. దీనిలో భాగంగా కొత్త టెక్నాల‌జీతో యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. అగ్నిప‌థ్ స్కీమ్ కింద సైన్యంలో సుమారు 45వేల మందిని చేర్చుకోనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వ‌య‌సులోపు వారే దీంట్లో ఉంటారు. నాలుగేళ్ల పాటు యువ‌త స‌ర్వీసులో ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత మెరిట్, సంస్థాగత అవసరాలను బట్టి.. ఒక్కో బ్యాచ్​లో 25 శాతం వరకు సభ్యులను శాశ్వతంగా సర్వీసులో చేర్చుకుంటారు. వీళ్లు 15 ఏళ్ల స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్ల‌కు ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ కింద కొంత డబ్బు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వీరికి పెన్షన్ సౌకర్యం ఉండదు.

ఈ అగ్నిపథ్ సర్వీసు ప్రారంభించాలని మూడేళ్ల క్రితమే ఆర్మీ వర్గాలు నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా కారణం ఇప్పటి వరకు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ కింద యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35-36 ఏళ్ల నుంచి 25-26 ఏళ్లకు తగ్గనుంది. అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద ఎంపికైన అభ్య‌ర్థుల‌కు మొదటి సంవ‌త్స‌రంలో రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజిని అందిస్తారు. అది నాలుగో సంవత్స‌రం నాటికి 6.92 లక్షలకు పెరగనుంది. ఇది కాకుండా రిస్క్ అల‌వెన్సులు, ఇత‌ర అల‌వెన్సులు అంద‌జేస్తారు. నాలుగేళ్ల సర్వీసు ముగిసిన త‌ర్వాత య‌వ‌త‌కు రూ.11.7 లక్షలను సేవా నిధి రూపంలో అందజేస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like