టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జ‌రిమానా

హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు పెట్టేవారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఫ్లెక్సీలను తొలగించని వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. అది ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా డోంట్‌ కేర్‌ అంటూ కొరడా ఝలిపిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. నగరంలో ఎక్కడ ఫ్లెక్సీలు కనిపించినా వెంటనే తొలగిస్తున్నారు. మూడు రోజుల కింద ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్‌ నల్లచెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు. స్థానికులు, ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో ఉప్పల్‌ మున్సిపల్‌ అధికారులు అలెర్టయ్యారు. వెంటనే రంగంలోకి దిగి దారిపొడవునా వెలసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించారు. ఏకంగా ఎమ్మెల్యేకే జరిమానా విధించారు. ఫ్లెక్సీలు తొలిగించనందుకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డిని బాధ్యుడిని చేశారు. లక్షా 30 వేల రూపాయల జరిమానా విధించారు. ఎమ్మెల్యేకే జరిమానా విధించడంపై జీహెచ్‌ఎంసీ అధికారులను అభినందిస్తున్నారు స్థానికులు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like