టీటీడీ డైరీలు, క్యాలెండర్లు నేరుగా ఇంటికే

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. శ్రీవారి ప్రసాదాలు, ఫోటోలు, డైరీలు, క్యాలెండర్లకు అంతే డిమాండ్ ఉంటుంది. అందుకోసం భక్తులకు స్వామివారి క్యాలెండర్లు, డైరీలు అందించేందుకు టీటీడీ సిద్ధమైంది.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. శ్రీవారి ప్రసాదాలు, ఫోటోలు, డైరీలు, క్యాలెండర్లకు అంతే డిమాండ్ ఉంటుంది. అందుకోసం భక్తులకు స్వామివారి క్యాలెండర్లు, డైరీలు అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. టీటీడీ రూపొందించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. టీటీడీకి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్‌ సైట్‌ లో ‘పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేసి డెబిట్‌, క్రెడిట్‌కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి త‌పాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతారు. భ‌క్తులు ఎన్ని క్యాలెండ‌ర్లు, డైరీల‌నైనా బుక్ చేసుకోవ‌చ్చు. ఆన్‌ లైన్‌ లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్‌, షిప్పింగ్ ఛార్జీలు అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది.

విదేశాల్లోని భక్తులకు సైతం..
ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకునే విదేశాల్లోని భక్తులకు త‌పాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. త‌పాలా శాఖ నిర్దేశిత ఛార్జీల‌ను వ‌సూలుచేసి నిర్ణీత స‌మ‌యంలో పంపిస్తోంది. ఆన్‌లైన్‌ లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు షిప్పింగ్ కు సంబంధించిన స‌మాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియ‌చేస్తోంది.

పోస్టు ద్వారా ఇలా..
టీటీడీ క్యాలెండర్‌, డైరీలను పోస్టు ద్వారా కూడా పొందవచ్చు. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. డైరీ, క్యాలెండ‌ర్ల కొనుగోలుకు సంబంధించిన స‌మాచారం కోసం 0877-2264209 నంబ‌రు ద్వారా టీటీడీ పబ్లికేషన్స్ విభాగాన్ని 9963955585 నంబ‌రు ద్వారా గానీ సంప్ర‌దించాల్సి ఉంటుంది.

రుమల,తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ,వైజాగ్‌,హైదరాబాద్‌,చెన్నై,బెంగళూరు,న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు టీటీడీ క‌ల్యాణ‌మండ‌పాల్లో, టిటిడి అనుబంధ ఆల‌యాల్లో అందుబాటులో ఉంచారు.

డైరీలు, క్యాలెండ‌ర్ల ధ‌ర‌లు

12 పేజీల క్యాలెండర్‌ రూ.130/-

పెద్ద డైరీ రూ.150/-

చిన్నడైరీ రూ.120/-

టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-

శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20/-

శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ – రూ.15/-

శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండ‌ర్ రూ.15/-

తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-

Get real time updates directly on you device, subscribe now.

You might also like