3 ల‌క్ష‌ల టిక్కెట్లు… 16 నిమిషాలు..

రికార్డు సృష్టించిన టీటీడీ

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ సర్వదర్శన టికెట్లను శ‌నివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఈ సర్వదర్శన టికెట్లను విడుద‌ల చేసింది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్దతిలో టీటీడీ ఈ టికెట్ల కేటాయింపు చేపట్టింది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున డిసెంబర్ కోటా ఇచ్చారు. సర్వదర్శనం టికెట్లు కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడకూడదని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ రోజు విడుదల చేసిన 3,10,000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడం గమనార్హం. గత నెలలో 2.40 లక్షల టికెట్లను భక్తులు 19 నిమిషాల వ్యవధిలో పొందారు. రేపు ఉదయం 9 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను విడుదల చేయనున్నట్టుగా టీటీడీ తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like