మంచిర్యాల జిల్లాలో ఇద్ద‌రు మృతి

-రెండు వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో మృత్యువాత‌
-మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం
-బీమారం, బెల్లంప‌ల్లిలో రోడ్డు ప్ర‌మాదాలు

Two died in Road accidents: మంచిర్యాల జిల్లాలో జ‌రిగిన రెండు వేర్వేరు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలోని కోర్టు స‌మీపంలో ఒక‌రు, బీమారం మండ‌లం జోగువాగుల స‌మీపంలో మ‌రొక‌రు మృతి చెందారు. ఈ రెండు ప్ర‌మాదాల్లోనూ మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా మారింది.

భీమారం జోడు వాగు సమీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రేమ్ అనే యువ‌కుడు మృత్యువాత‌ప‌డ‌గా, ఆయ‌న మిత్రుడు కిర‌ణ్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్రేమ్ త‌న చిన్నమ్మ వాళ్లింట్లో కార్య‌క్ర‌మానికి బండిపై స్నేహితుడితో క‌లిసి మేక‌ను తీసుకునివెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో భీమారం జోడువాగు స‌మీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఓవర్ టేక్‌ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ముందు ఉన్న ఐచర్ వ్యాన్ బాడీకి తగిలి ప్రేమ్, కిర‌ణ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 108లో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండ‌గా, ప్రేమ్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో జ‌రిగిన మ‌రో ప్ర‌మాదంలో సైతం ఒక‌రు మృత్యువాత‌ప‌డ్డారు. బెల్లంప‌ల్లి బస్తీకి చెందిన తాజ్‌బాబా అనే యువ‌కుడు కాల్‌టెక్స్ నుంచి బ‌జార్ ఏరియా వైపు బైక్ పైన అతివేగంగా వ‌స్తున్నాడు. భీమిని మండ‌లం మ‌ల్లిడికి చెందిన మాంత‌య్య(55) న‌డుచుకుంటూ కోర్టు వైపు వ‌స్తున్నాడు. మాంత‌య్య కొడుకుపై గృహ‌హింస కేసు విష‌యంలో కోర్టుకు వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న స‌మ‌యంలో వ‌చ్చి ఢీకొట్టాడు. మాంత‌య్య అక్క‌డిక్క‌డే చనిపోయాడు. ఈ ప్ర‌మాదంలో తాజ్‌బాబా ప‌రిస్థితి సైతం విష‌మంగా మారింది. తాజ్‌బాబాను మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like