ఉద్రిక్తంగా మారిన కూల్చివేతలు

చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, బావురావుపేట గ్రామ పంచాయతీలలో జాతీయ రహదారి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండె మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆనుకొన్ని ఉన్న భూములలో పలవురు ఇండ్లను నిర్మించుకున్నారని స్పష్టం చేశారు.వీటికి ఎలాంటి అనుమతులు లేవన్నారు.

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించినట్లు తెలిపారు. లావణి పట్టా భూములు పలువురికి నిబంధనలకు ఆక్రమంగా అమ్మకాలు చేసారని స్పష్టం చేశారు. ఇండ్లు నిర్మించుకున్న లబ్దిదారుల వద్ద ఎలాంటి అనుమతులు కాని, రిజిస్ట్రేషన్ కు సంబందించిన పత్రాలు లేవని తహసీల్దార్ తెలిపారు. లావణి పట్టా భూములు అమ్మకాలు, కొనుగోలు చేయరాదన్నారు. ఇండ్ల నిర్మాణాలు సైతం1 చేపట్టకూడదని సూచించారు. ఎలాంటి ఆనుమతులు లేకుండా అక్రమంగా ఇండ్ల నిర్మాణాలను చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇండ్లను కూల్చి వేయడంపై బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ తిరుపతి, సీఐలు ప్రవీన్ కుమార్, విద్యాసాగర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like