ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ నిలిపివేత‌

-విచార‌ణ‌కు ఆదేశించిన క‌లెక్ట‌ర్
-విచార‌ణాధికారిగా నిర్మ‌ల్ ఆర్డీవో
-స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించాం : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

నిర్మ‌ల్:నిర్మ‌ల్ మున్సిపాలిటీలోని పీహెచ్‌సీ వ‌ర్క‌ర్ల నియామ‌క వివాదాలు రాజుకుంటున్న నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ నిలిపివేస్తూ క‌లెక్ట‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద్యోగ‌ల భ‌ర్తీ ప్ర‌క్రియ నిలిపివేస్తున్నాం… దీనిపై విచార‌ణ‌కు ఆదేశించాం.. విచార‌ణాధికారిగా నిర్మ‌ల్ ఆర్డీవోను నియ‌మించామ‌ని క‌లెక్ట‌ర్ ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించాం : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి
నిర్మ‌ల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వ‌ర్క‌ర్ల నియామ‌క ప్ర‌క్రియ నిలిపివేస్తున‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌క‌టించారు. క్యాంప్ ఆపీస్లో మీడియాతో మాట్లాడుతూ నిర్మ‌ల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వ‌ర్క‌ర్ల నియామ‌కాల‌పై కొన్ని రోజులుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుమంత్రి తెలిపారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక స‌మ‌ర్పించాలంటూ క‌లెక్ట‌ర్ కు ఆదేశాలిచ్చిన‌ట్లు చెప్పారు. నివేదిక అందిన వెంట‌నే దాన్ని ప‌రిశీలించి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like