ఉక్రేయిన్ నుంచి భారతదేశానికి రాను…

ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అయితే.. ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని తేల్చి చెప్పింది. మానవత్వా న్ని చాటుకుం టూ.. ఓ కుటుంబానికి అండగా నిలిచేం దుకు సిద్ధపడిం ది.

ఉక్రెయిన్ ఆక్రమణ కోసం రష్యా తలపెట్టిన యుద్దం రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నది. మూడోరోజైన శనివారం కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపిస్తూ, వాటిని వశం చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని తేల్చి చెప్పింది. మానవత్వా న్ని చాటుకుం టూ.. ఓ కుటుంబానికి అండగా నిలిచేందుకు సిద్ధపడింది. ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతున్నా.. నేహా అనే వైద్య విద్యా ర్థిని అక్క డే ఉండేందుకు నిర్ణ‌యం తీసుకుంది.

యుద్ధంలో పాల్గొనేందుకు ఇంటి యజమాని కదనరంగం లోకి దిగగా.. ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు అండగా నిలిచేం దుకు అక్క డే ఉండేందుకు నిర్ణయించుకుంది. సంరక్షకులను కోల్పో తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసని పేర్కొన్న నేహా.. ప్రస్తుతం ఓ బంకర్లో ఆ పిల్లలు, వారి తల్లికి రక్షణగా నిలిచింది. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘బతికుంటానో లేదో తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలు, వారి తల్లిని వదిలేసి రాలేను’ అని హరియాణాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తల్లికి ఫోన్ ద్వారా నేహా స్పష్టం చేసింది. సమీపం లో బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని.. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్న ట్లు తెలిపింది. నేహా గురించి ఆమె స్నేహితురాలు సవితా జఖార్ ఫేస్బుక్ ద్వా రా వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like