ఉక్రెయిన్ లో ఇస్కాన్ సేవలు..

-బాధితుల‌కు భోజనం పంపిణీ
-మొత్తం 54 దేవాల‌యాలు తెరిచి ఆశ్రయం

యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే అక్క‌డ బాధితుల‌కు సేవ‌లు అందించ‌డంలో ఇస్కాన్ ముందుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో పరిస్థితులు మరింత క్షిణిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ దేశం వదిలి వెళ్లిపోతున్నారు. కనీసం తిండి కూడా దొరకని పరిస్థితుల్లో సరిహద్దులు దాటుకుంటూ పక్కనే ఉన్న దేశాలకు వలస వెళుతున్నారు. ఉక్రెయిన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పలు దేశాల సరిహద్దుల వద్ద శరణార్ధులకు అన్నపానీయాలు అందిస్తూ సాయం చేస్తున్నారు ఇస్కాన్ ప్రతినిధుల బృందం. భారత రాయబార కార్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు.. ఉక్రెయిన్- హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న శరణార్ధులకు ఇస్కాన్ ఆధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఉక్రెయిన్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఇస్కాన్ సంస్థ అధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉక్రెయిన్ లోని 54 ఇస్కాన్ దేవాల‌యాల్లో భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా తలదాచుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఇస్కాన్ మందిరంలో పాకిస్తాన్ కు చెందిన పౌరులు కూడా ఆశ్రయం పొందారు. ఇస్కాన్ తో పాటు సిక్కు గురుద్వారా కూడా ఉచిత బోజన,వసతి సౌకర్యం కల్పిస్తోంది. ప్రతిరోజు కీవ్ తో పాటు వివిధ నగరాల్లో వీధుల్లో సాముహిక భోజనాలు అందిస్తున్నారు. దిక్కు తోచని క్లిష్ట సమయంలో వెన్నంటి ఉన్న ఇస్కాన్, గురుద్వారా ల దాతృత్వం, సేవల్ని భారతీయులు ముఖ్యంగా వైద్య విద్యార్థులు ప్రశంసిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like