ఉరి వేసుకుని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

మంచిర్యాల :మ‌ంచిర్యాల జిల్లా బీజోన్ ఏరియాలో ఓ యువ‌కుడు త‌న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో మంగ‌ళ‌వారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కుటుంబ‌స‌భ్యులు వెళ్లి చూడ‌గా ఉరి వేసుకుని క‌నిపించాడు. వివ‌రాల్లోకి వెళితే వ‌డ్లూరి ప్ర‌శాంత్ బీజోన్ మార్కెట్ ఏరియా నివాసం ఉంటున్నాడు.ఇత‌రు కారు డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. రెండేళ్ల కింద‌ట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి కాపురం కొద్ది రోజులు స‌జావుగానే సాగింది. కానీ, ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో భార్య అత‌నిపై కేసు పెట్టింది. అత్త, మామ‌, భ‌ర్తపై వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో ప్ర‌శాంత్ జైలుకు సైతం వెళ్లి వ‌చ్చాడు. ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ ఆమె త‌ర‌చూ ఫోన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, త‌మ‌ కోడ‌లు ఫోన్లో వేధించ‌డం వ‌ల్ల‌నే కొడుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ప్ర‌శాంత్ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like