ఉత్ప‌త్తితో పాటు ర‌క్ష‌ణ కూడా ముఖ్యం

మంచిర్యాల : కార్మికులు ఉత్ప‌త్తితో పాటు ర‌క్ష‌ణ‌పై కూడా దృష్టి సారించాల‌ని కేకే 1 మేనేజర్ లక్ష్మీనారాయణ స్ప‌ష్టం చేశారు. గురువారం ఉద‌యం మొద‌టి షిఫ్ట్‌లో కార్మికుల‌తో మాట్లాడారు. రక్షణ పరికరాలను ఉపయోగిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఉత్ప‌త్తి చేయాల‌న్నారు. గ‌నికి సంబంధించి ర‌క్ష‌ణ విష‌యంలో సేఫ్టీ జనరల్ మేనేజర్ గురువయ్య, మందమర్రి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఎప్ప‌టిక‌ప్పుడు సూచనలు అందిస్తార‌ని వెల్ల‌డించారు. దీంతో కేకే 1 గ‌నిలో రక్షణ తో కూడిన ఉత్పత్తి వంద శాతం పైగా సాధిస్తున్న‌ట్లు చెప్పారు. రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం పనికి రాదన్నారు. అలాగే డ్యూటీకి వచ్చే సమయం లో ప్రతి ఒక్కరూ హెల్మెట్‌t ధరించాలన్నారు. రక్షణే నా బాధ్యత అనే బ్యాడ్జీల‌ను ఉద్యోగులకు పంపిణీ చేశారు. గని అవరణ లో పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచు తున్నకోడూరి ఐలయ్య అనే కార్మికుడికి బహుమతి ప్రధానం చేశారు. కార్య‌క్ర‌మంలో ఎస్‌వో ర‌మేష్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ కృష్ణప్రసాద్, వెల్ఫేర్ అధికారి సంఘమిత్ర, సీనియ‌ర్ అండ‌ర్ మేనేజ‌ర్ ముర‌ళి, ఓవ‌ర్‌మెన్లు సాయి, ర‌మేష్‌, టీబీజీకేఎస్ పిట్ సెక్ర‌ట‌రీ మాధ‌వ‌రెడ్డి, రాజిరెడ్డి, ఎం.ఈశ్వ‌ర్‌, ఏఐటీయూసీ నాయ‌కులు వీ.ప్ర‌భాక‌ర్‌, సాంబ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like