వాసిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో..

-పెద్ద‌వాళ్ల‌ను తిడితే పెద్దోడివి కావు
-నీ చ‌రిత్ర ఏంటో అంద‌రికీ తెలుసు
-కార్మికుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే య‌త్నాలు మానుకోవాలి
-తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు B.వెంకట్రావ్

మంచిర్యాల:పెద్ద వాళ్ల‌ను తిట్టినంత మాత్రాన పెద్దోళ్ల‌ను అయిపోర‌ని, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామ‌య్య త‌న నోరు అదుపులో పెట్టుకోవాల‌ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు B.వెంకట్రావ్ హెచ్చ‌రించారు. శ్రీ‌రాంపూర్ ఏరియా RK7A (న్యూటెక్) గ‌నిలో నిర్వ‌హించిన గేట్ మీటింగ్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ముఖ్య‌మంత్రిని, మా గౌర‌వ అధ్య‌క్షురాలు క‌విత‌ను, ఇత‌ర నేత‌ల‌ను వాసిరెడ్డి సీతారామ‌య్య తిడుతున్నార‌ని అన్నారు. ఇలాంటి విమర్శ చేస్తే పెద్దోడివి అవుతావని నీ ఇమేజి పెరుగుతుందని భ్ర‌మ‌ప‌డొద్ద‌ని అన్నారు. ఇలాంటి విమర్శలు మానుకోకపోతే ఖబర్దార్ అని హెచ్చరించారు. కార్మికులకు అబద్ధాలు చెబుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శిస్తున్నారని దీని కార్మికలోకం గమనిస్తోంద‌ని అన్నారు.

నీ చ‌రిత్ర ఏంటో..? సింగ‌రేణిలో అంద‌రికీ తెలుసున‌ని ఆయ‌న దుయ్య‌బట్టారు. ఉద్యోగానికి వచ్చేటప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఏ వ్యాపారాలు చేసి ఈ స్థాయికి ఎదిగావో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. కొత్తగూడెంలోని ప్రధాన ఆసుపత్రిలో ఉన్నా దిరిసెన‌ చెట్టును అడిగితే ఏంటిదో నీ చరిత్ర తెలుస్తుందని అన్నారు. గద్దరాగాడి, సున్నం బ‌ట్టిలోని భూములను అడిగితే నీ చరిత్ర ఏంటిదో తెలుస్తుందని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో మీ నాయ‌కులు చేసిన ప‌నులు చెప్పుకుని బ‌త‌క‌డం త‌ప్ప నీవు కార్మికుల‌కు ఒక్క హ‌క్కైనా సాధించావ‌ని ప్ర‌శ్నించారు. కావాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శించడం తప్ప వేరే పని దొరకడం లేదా..? అన్నారు. వార‌సత్వ ఉద్యోగాల‌తో స‌హా ఎన్నో హ‌క్కులు పొగొట్టింది నీ హ‌యాంలో కాదా..? అని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ప్రైవేటీక‌ర‌ణ ప్రోత్స‌హించింది మీరు కాదా..? అని దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ బొగ్గుగ‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌నే ఎన్నో కార్మికుల హ‌క్కులు సాధించామ‌ని వెంకట్రావ్ వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మా అధినేత్రి క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోనే కార్మికుల‌కు కావాల్సిన అన్ని హ‌క్కులు తెచ్చుకున్నామ‌ని, సౌక‌ర్యాలు సైతం క‌ల్పించామ‌న్నారు. అలాంటి వారిని విమ‌ర్శించే అర్హ‌త నీకెక్క‌ద‌ని ప్ర‌శ్నించారు. ఈ రోజు కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి కార్మికులకు అందిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏరియా ఉపాధ్య‌క్షుడు కేతిరెడ్డి సురేంద‌ర్ రెడ్డి అధ్యక్ష‌త‌న జ‌రిగిన సమావేశంలో కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, డీకొండ అన్నయ్య,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్,కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి,ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి, ఆల్టర్నేట్ కమిటీ స‌భ్యులు బుస రమేష్,అశోక్ ,ఏరియా నాయకులు లాగల శ్రీనివాస్, చిలువేరు సదానందం,కిషన్,పిట్ సెక్రటరీ శ్రీరాములు, సంపత్,సాగర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like