వాక్సిన్ వేసుకుంటేనే.. వన దేవతల దర్శనం…!

సమ్మక్క, సారక్క జాతరకు వైద్యాధికారులు నిబంధనలు విధించారు. వన దేవతలను దర్శించుకునే తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. దర్శనానికి వచ్చేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించిన తర్వాతే అనుమతి ఇస్తామని చెప్పారు. రెండు నెలల్లో జాతర జరగనున్న నేపథ్యంలోనే ఇప్పటి నుండే లక్షల మంది భక్తులు వన దేవతను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఆంధ్ర, చత్తీస్గడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. ఈ సంధర్భంలోనే కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో వనదేవతలను దర్శించుకునే వారికి ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు కోవిడ్ టెస్ట్లు చేస్తున్నారు. టీకా తీసుకోనికి వారి టీకా వేయడం, ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ ఇవ్వడం, రెండు డోసులు తీసుకున్నవారు సర్టిఫికెట్ చూపిస్తేనే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.

రానున్న ఫిబ్రవరిలో లక్షలమంది భక్తులు మూడు రోజుల పాటు అక్కడే ఉండి దర్శనం చేసుకుంటారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెళ్లడించారు. జాతర సంధర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like