వాసిరెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే..

KK 5 న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న‌

మంచిర్యాల : ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామ‌య్య తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని టీబీజీకేఎస్ ఉపాధ్య‌క్షుడు మేడిప‌ల్లి సంప‌త్ డిమాండ్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌నగా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ ఒక సీనియ‌ర్ రిటైర్డ్ క్ల‌ర్క్‌గా, బాధ్య‌తాయుత‌మైన ఒక యూనియ‌న్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. 2015లో అపాయింట్ అయిన ఎక్స్‌ట‌ర్న‌ర‌ల్ జూనియ‌ర్ అసిసెంట్ల‌పై చేసిన అనుచిత వ్యాఖ్యాల‌కు ఖ‌చ్చితంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు.

వారు లాడ్జీల్లో ప‌రీక్ష‌లు రాశార‌ని, ఆ ఉద్యోగాలు టీబీజీకేఎస్ గౌర‌వ అధ్య‌క్షురాలు క‌విత అమ్ముకున్నార‌ని ఇలా ఇష్టారీతిన మాట్లాడం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జూనియ‌ర్ అసిస్టెంట్ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా మాట్లాడార‌ని అన్నారు. వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ముగిసి సంవ‌త్స‌రం గ‌డిచినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

టీబీజీకేఎస్ పిట్ సెక్ర‌ట‌రీ జీడిబాపు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ వైస్ ప్రెసిడెంట్ బ‌డికెల సంప‌త్ కుమార్‌, జే.ర‌వీంద‌ర్ రావు,జీఎం క‌మిటీ స‌భ్యులు డి.శంక‌ర్‌రావు, మిట్ట సూర్య‌నారాయ‌ణ‌,వై.ప‌వ‌న్‌కుమార్‌,వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ టి.సార‌య్య‌,క్ల‌రిక‌ల్ సిబ్బంది మోత్కురురాజేంద‌ర్‌,సురేష్‌,గొట్టె రాజ‌శేఖ‌ర్‌,రాజ‌కుమార్‌,జ‌నార్ద‌న్,ఏరియా నాయ‌కులు వీరారెడ్డి, రాంచంద‌ర్‌, విక్ర‌మ్‌సింగ్‌,చంద్ర‌శేఖ‌ర్‌,మధుసూద‌న్‌,నాగేశ్వ‌ర్రావు నాయ‌క్‌,హ‌రినాయ‌క్‌,డి.మొగిలి, బొడ్డుమ‌ల్లేష్‌, పెండం కృష్ణ‌సాయి,ల‌క్ష్మ‌ణ్‌, తేజ‌,ఎల్దురు శ్రీ‌ను,సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like