వేడివేడిగా చ‌లికాలం స‌మావేశాలు..

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న - సాగుచ‌ట్టాల ర‌ద్దు, పెగాస‌స్‌పై కాంగ్రెస్‌, విప‌క్షాల గొడ‌వ

పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఆ త‌ర్వాత ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం మొద‌లైంది. కానీ ఆ స‌మ‌యంలో టీఆర్ఎస్ నేత‌లు స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు.

లోక్‌స‌భ ప్రారంభం కాగానే సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుతో పాటు పెగాస‌స్ త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. ప్ర‌శ్నోత్త‌రాలు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశాయి. ఆయా పార్టీల ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. ప్ల‌కార్డుల‌తో వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. రాజ్య‌స‌భ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌తో చైర్మ‌న్ స‌భ వాయిదా వేశారు. లోక్‌స‌భ తిరిగి ప్రారంభం కాగానే విప‌క్షాల నిర‌స‌న మ‌ధ్య సాగుచ‌ట్టాల ర‌ద్దు బిల్లు లోక్‌స‌భ ఆమోదించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like