ఇంటి వరండాలో ఊహించని సీన్.. చూసి షాకైన జనాలు.. వైరల్ వీడియో.!

సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు..

సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. ముఖ్యంగా సింహం, పులి, మొసలి, చిరుత వేటకు సంబంధించిన వీడియోలు.. అలాగే పైథాన్ వీడియోలు నెట్టింట ఎక్కువగా వ్యూస్ తెచ్చుకుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి తరచూ భారీ కొండచిలువలు, విష సర్పాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామాలు, శివారు ప్రాంతాలను ఈ సరీసృపాలు హడలెత్తిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అడవులు, పొదల్లో దాగివున్న పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలో భారీ కొండ చిలువ హల్‌చల్‌ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నడికూడ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఓ భారీ పొడవైన కొండచిలువ ఏకంగా ఓ ఇంటి ఆవరణలోకే వచ్చేసింది. ఇంటి ప్రహారీలోకి ప్రవేశించిన కొండచిలువ ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ఇంటి తలుపులు మూసి ఉండటంతో ప్రమాదం తప్పినట్లైంది. అంతలోనే ఇంట్లోనివారు వరండాలోని ఈ సీన్ చూసి తక్షణమే అప్రమత్తమయ్యారు. భయంతో పరుగులు తీసి కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల జనాలు భారీగా గుమిగూడారు.. పామును బంధించి అటవీ అధికారులకు అప్పగించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like