వ‌రంగ‌ల్ స‌భ‌కు భారీగా..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా నుంచి రాహుల్ స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివెళ్లారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌, ప్రేంసాగ‌ర్ రావు నాయ‌క‌త్వంలో పెద్ద ఎత్తున బ‌య‌ల్దేరి వెళ్లారు. జిల్లా నుంచి పెద్దఎత్తున బ‌స్సులు, కార్ల ద్వారా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివెళ్లారు. జై కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీ నాయ‌క‌త్వం వ‌ర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బ‌య‌ల్దేరారు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సూరంరవీందర్ రెడ్డి నాయకత్వంలో రైతు సంఘర్షణ సభకు త‌ర‌లివెళ్లారు. ఈ సంద‌ర్భంగా సూరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయ శ‌క్తి కోసం ఎదురు చూస్తున్నార‌ని, అది కాంగ్రెస్ పార్టీనే అని స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌ని చెప్ప‌డానికి పెద్ద ఎత్తున త‌ర‌లివస్తున్న ప్ర‌జ‌లు, రైతులే ప్ర‌త్య‌క్ష‌సాక్ష్య‌మ‌ని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like