ప‌ట్టాలిచ్చి తీరుతాం..

మాదారం టౌన్‌షిప్‌లో నివ‌సిస్తున్న వారికి ఖ‌చ్చితంగా ప‌ట్టాలు ఇచ్చి తీరుతామ‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మాదారం టౌన్షిప్ లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ జీవితం ప్రజలకే అంకితం.. నా ప్రాణం ఉన్నంతవరకు నిరుపేద సేవ చేయడమే లక్ష్యమన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన త‌న‌ను మీ బిడ్డగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆద‌రించార‌ని ఈ ఎన్నికల్లో కూడా గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో డబ్బుల సంచులతో ఓట్లు కొని గెలుస్తామనుకునే వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల‌న్నారు. చెన్నూర్‌లో ఐదు సార్లు ఓడిపోయిన వినోద్ అక్కడ పోటీ చేసే ముఖం లేక బెల్లంపల్లిలో పోటీ చేస్తున్నాడ‌ని అన్నారు. వినోద్ గెలిచినా హైద‌రాబాద్‌కే ప‌రిమితం అవుతాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌ట్టాల విష‌యంలో ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రితో మాట్లాడామ‌ని, ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చేలా చూస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో టీజీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జ‌డ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, టీబీజీకేఎస్‌ చ‌ర్చ‌ల ప్ర‌తినిధి మంగీలాల్, ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, సర్పంచ్ ధరావత్ సాగరిక, జడ్పీటీసీ బాణయ్య, జంగంపల్లి అశోక్ కుమార్, మంగపతి సురేశ్ బాబు, దుగుట స్వప్న, మామిడాల రాజేష్, బోడ సతీశ్, సుభాష్, రమాదేవి, చంద్ర‌క‌ళ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like