వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్ల‌కు శుభ‌వార్త‌.. !

వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్ప‌ద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాల‌కు దారితీసిన సంద‌ర్భాలున్నాయి.. చిన్ని పంచాయితీలు వాట్సాప్‌కు ఎక్కి.. ఏకంగా పోలీస్ స్టేష‌న్‌కు చేరిన సంద‌ర్భాలు కూడా లేక‌పోలేదు.. ఆ త‌ర్వాత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల‌పైనే అంతా భారం మోప‌డం ప్రారంభ‌మైంది.. గ్రూపులో ఏం జ‌రిగినా.. దానికి బాధ్య‌త వ‌హించాల్సింది మాత్రం అడ్మినేలా త‌యారైంది ప‌రిస్థితింది.. అయితే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల‌కు ఊర‌ట క‌ల్పించేలా ప‌నిచేస్తోంది ఆ సంస్థ.. వాట్సాప్‌ గ్రూప్‌లోని సదరు యూజర్‌ షేర్‌ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తోంది.

అయితే, ఇలాంటి మోడరేషన్‌ పీచర్ ఇప్ప‌టికే టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో ఉండ‌గా.. వాట్సాప్ కూడా దానిపై ప‌నిచేస్తున్న‌ట్టు నివేదిక‌లు చెబుతున్నాయి.. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. .గ్రూప్స్‌లోని స‌ద‌రు యూజ‌ర్లు పంపిన సందేశాల‌ను అడ్మిన్స్‌ డిలీట్‌ చేసే ఫీచర్‌ను అందులో చూడొచ్చు.. సదరు యూజర్‌ పంపిన మెసేజ్‌ను గ్రూప్‌ అడ్మిన్స్‌ డిలీట్‌ చేశారనే విషయాన్ని గ్రూప్‌లోని ఇత‌ర స‌భ్యులంద‌రికీ తెలుస్తుంది.. అయితే, వాట్సాప్‌ తీసుకురానున్న ఈ స‌రికొత్త‌ ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట క‌లిగే అవ‌కాశం ఉంటుంది.. ఎందుకంటే.. గ్రూప్‌లో వ‌చ్చే ఫేక్ న్యూస్, చెత్త‌, చేటు చేసే కంటెంట్‌లను అరికట్టడానికి గ్రూప్‌ అడ్మిన్ల‌కు ఇది దోహ‌ద‌ప‌డ‌నుంది..

Get real time updates directly on you device, subscribe now.

You might also like