వాట్సప్.. అన్ని డ‌బుల్‌

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అటు ఫైళ్ల‌ సామర్ధ్యాన్ని ఇటు గ్రూప్ పరిమితిని పెంచి.. మరింతమంది యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

వాట్సప్ తెలియనివాళ్లు లేరు. ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుుడ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఫైల్ సామర్ధ్యాన్ని పెంచింది. గ్రూప్ పరిమితిని రెట్టింపు చేసింది. కొత్త ఈమోజీలకు లాంచ్ చేసింది.

వాట్సప్‌లో మొన్నటి వరకూ 100 ఎంబీ ఫైల్ వరకూ మాత్రమే బదిలీ చేసేందుకు వీలుండేది. ఈ విషయంలో యూజర్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు వాట్సప్‌లో ఒకేసారి 2 జీబీ వరకూ ఫైల్స్ పంపించుకునే వెసులుబాటు కల్పించింది వాట్సప్. వైఫై నెట్వర్క్ ద్వారా యూజర్లు 2 జీబీ ఫైల్స్ పంపించుకోవచ్చు. ఇక మరోవైపు వాట్సప్ గ్రూపులో మొన్నటి వరకూ 256 మందికే అవకాశముండేది. ఇక నుంచి ఈ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసింది. ఒక గ్రూపులో 512 మందిని చేర్చుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులో రానుంది.

ఇక ఫేస్‌బుక్‌లానే వాట్సప్‌లో కూడా ఈమోజీ రియాక్షన్లను యూజర్లకు అందుబాటులో తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈమోజీ ఫీచర్లు వాట్సప్ పోటీ వేదికలైనా సిగ్నల్, టెలీగ్రామ్, ఐమెస్సేజెస్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాట్సప్ కూడా ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వాట్సప్ వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like