వాట్సాప్‌ పేమెంట్లు. క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు..

వాట్స‌ప్ మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. మ‌న దేశంలో అత్యధిక యూపీఐ లావాదేవీలు ఉన్న గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తోంది. ఇందులో భాగంగా యూజ‌ర్ల‌కు భారీగా ఆఫర్లను ప్రకటించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. NPCI వాట్సాప్‌ వినియోగదారుల కోసం దాని చెల్లింపుల పరిమితిని 100 మిలియన్లకు పెంచింది. ఇది ఇప్పటికే భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది.

వాట్సాప్ ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులకు రూ. 33 వరకు క్యాష్‌బ్యాక్ అందించనుంది. WhatsApp Pay ఉపయోగించి, వినియోగదారులు చాట్ విండో నుండి నేరుగా వారి కాంటాక్ట్స్ కు డబ్బు పంపవచ్చు. వాట్సాప్ నుండి ఈ క్యాష్‌బ్యాక్ పొందడానికి వినియోగదారులు ఎంత డబ్బు పంపాలి అనే దానిపై కనీస పరిమితి ఏమీ లేదు. ఈ ఆఫర్​ 3 లావాదేవీలకు మాత్రమే. వినియోగదారులు వాట్సాప్ పే ద్వారా ఇతర వినియోగదారులకు రూ. 1 కంటే తక్కువ పంపినా, వారు కూడా క్యాష్​బ్యాక్​కు అర్హులే.

వాట్సాప్ ద్వారా ఎక్కువగా ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేలా చూడటానికి కంపెనీ ఈ ఆఫర్లను ప్రకటిస్తుంది. వాట్సాప్‌లో చెల్లింపుల అవకాశాలను అన్‌లాక్ చేయడానికి క్యాష్‌బ్యాక్ ప్రచారాన్ని దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఓ వార్త సంస్థతో తెలిపింది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇంతకముందు కూడా ఇలాంటి క్యాష్ బాక్ ఆఫర్లను వాట్సాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like