WhatsApp: పది రోజుల్లో ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయడం మానేస్తుంది! మీ ఫోన్ అందులో ఉందేమో ఇక్కడ చెక్ చేసుకోండి!

WhatsApp: కొన్ని ఫోన్లలో వాట్సప్ యాప్ నిలిపివేస్తామని కొంతకాలంగా ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెబుతూ వస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించి తేదీ విడుదల చేసింది. చాలా స్మార్ట్‌ఫోన్‌లపై నవంబర్ 10 నుంచి వాట్సప్ పనిచేయడం ఆపేయనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి పాత వెర్షన్‌లకు ఈ యాప్ మద్దతు ఇవ్వదని వాట్సాప్ తన ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ OS 4.1.. దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు మాత్రమే వాట్సప్ యాప్ మెసేజింగ్ యాప్‌ని ఉపయోగించగలరు.

ఆండ్రాయిడ్.. ఐఓఎస్ వినియోగదారులందరూ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడం ద్వారా వాడుతున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ని కూడా చెక్ చేయవచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like