సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఎక్కడ…?

-ఎమ్మెల్యేలు బానిస‌ల్లా బ‌తుకుతున్నారు
-బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెర‌బెల్లి రఘునాథ్

Manchiryal: ముఖ్యమంత్రి కేసీఆర్ సింగ‌రేణి కార్మికుల‌కు ఎన్నో హామీలు గుప్పించార‌ని వాటంన్నిటి తుంగ‌లో తొక్కార‌ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెర‌బెల్లి రఘునాథ్ దుయ్య‌బ‌ట్టారు. ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నస్పూర్ సీసీసీ కార్నర్ వద్ద 100 వ కార్నర్ మీటింగ్ ముగింపు సభ నిర్వహించారు. ర‌ఘునాథ్ మాట్లాడుతూ 27 ఫిబ్రవరి 2018లో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం సింగరేణి సభలో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమాయ్యాయ‌ని ప్ర‌శ్నించారు. 10 వేల కొత్త క్వార్టర్లు, మిషన్ భగీరథ ద్వారా ఉచిత నీరు, ఉచితవిద్యుత్‌, రిటైర్డ్ కార్మికులకు 200 గజాల భూమి, 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇలా ఎన్నో హామీలు ఇచ్చార‌ని గుర్తు చేశారు. హామీలు ఇచ్చి సింగరేణి కార్మికులను మోసం చేసిన ఘనత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌దే అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలపై జిల్లాలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని ప్రశ్నించకుండా బానిస బతుకులు బ‌తుకుతున్నారని అన్నారు.

స‌భ‌కు హాజ‌రైన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదన్నారు. మంచిర్యాల అసెంబ్లీలో కడెం కాలువ, గూడెం లిఫ్ట్ ద్వారా సాగు నీరు పంటలకు ఎండుతున్నా పట్టించుకోని మూర్ఖుడు కేసీఆర్‌ అని అన్నారు. రైతులు పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్న ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదన్నారు. నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పొనుగోటి రంగ రావు, రజినిష్ జైన్, పెద్దపల్లిపురుషోత్తం, ఆనంద్ కృష్ణ, కృష్ణ మూర్తి, కర్ణ శ్రీధర్, మోటపలుకుల తిరుపతి, బుద్దే రాజన్న, మల్క రాజేశం తదిదరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like