మీ అవినీతి దాహం తీరేదెన్నడు…?

Singareni:సింగరేణి సంస్థను అధికార పార్టీ దొచుకుతింటున్నదని BMS ఉపాద్యక్షుడు అప్పని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీకే 6 ఇంక్లైన్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో అధికార పార్టీ రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను అంగడిలో సరుకులా అమ్మకానికి సిద్ధపడ్డారన్నారు. TBGKS యూనియన్ నాయకుల వల్ల కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని దుయ్యబట్టారు. సింగరేణి సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ట్రాన్స్కో, జెన్కో నుండి 24,730 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు చెల్లించే ఏరియర్స్, బోనస్ లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించటం లేదనారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అనేక టాక్స్లు, రాయల్టీ టాక్స్ రూపంలో ప్రతి సంవత్సరము సుమారు 14 వేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని గమనించాలని తెలిపారు. 11వ వేతన ఒప్పందం ఎరియర్స్ తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుండి ఇచ్చినట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటనలు ఇవ్వటం దారుణమన్నారు.

దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు జేబీసీసీఐ 11వ వేతన ఒప్పందంలో 19% మినిమం గ్యారెంటీ బెన్ఫిట్, 25% అలవెన్స్ పెరుగుదల లో BMS నాయకత్వ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల శాఖ మంత్ర ప్రహ్లాద జోషి చొరవతో మంచి వేతన ఒప్పందం జరిగిందనీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం కాదని తెలిపారు.

కోల్ ఇండియాలో కార్మికులకు ఎరియర్స్ సెప్టెంబర్ 3వ తేదీన చెల్లించారని, సింగరేణి సంస్థ కార్మికులకు ఎరియర్స్ చెల్లించడంలో జాప్యానికి సింగరేణి సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం నిజం కాదా అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ట్రాన్స్కో, జెన్కో నుండి ₹24,730 వేలకోట్లు బకాయిలు రావాలి ఎప్పటిలోగా ఇప్పించగలరో జవాబు చెప్పాలని ఎమ్మెల్సీ కవితను డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల ప్రకటన కేవలం పేపర్ల మీద అక్షరాలుగా కనిపిస్తున్నాయని, డబ్బులు లిక్విడ్ క్యాష్ రూపంలో ఏ బ్యాంకు లోను లేదు కాబట్టి సంస్థ యాజమాన్యం రెండు దఫాలుగా చెల్లించాలని నిర్ణయం తీసుకుందన్నారు. BMS ఇతర కార్మిక సంఘాలు ఒకే దఫాలో చెల్లించాలని తీవ్ర ఆందోళన చేస్తే, తప్పని పరిస్థితుల్లో ఒకే దఫాలో చెల్లించారని పేర్కొన్నారు.

బొగ్గుగనుల ప్రవేటికరణ గూర్చి మాట్లాడే కవితక్కకు సింగరేణి ఓపెన్ కాస్టులలో, అండర్ గ్రౌండ్ పనుల్లో ప్రవేటు SDL యంత్రాలతో పాటూ బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టు వారికి అప్పగించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. శాశ్వత కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుంటే దాన్ని ఏమంటారో కార్మికులకు జవాబు చెప్పాలనీ ప్రశ్నించారు. సింగరేణి గుర్తింపు ఎన్నికలను స్వాగతించాలని కార్మికుల కోరగా కార్మికులు స్వాగతిస్తున్నామని చప్పట్లతో హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి వెలబోయిన సుజెందర్, పాంద్రాల మల్లేష్, రసకట్ల నర్సింగరావు, రేణిగుంట్ల మల్లేష్, సంపత్ దొంగల రాజేందర్, జనార్ధన్, ఫిట్ కార్యదర్శులు కెక్కర్ల కార్తీక్ ఎండి యూసఫ్, పునీత్ రావు చిట్యాల ప్రవీణ్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like