యాజ‌మాన్యం టీబీజీకేఎస్ తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తోంది

బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రిలో రెడ్డి ర‌త్న‌మ్మ అనే మ‌హిళ మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సింగ‌రేణి యాజ‌మాన్యం మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ని, వాళ్లు టీబీజీకేఎస్ తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అఖిల‌ప‌క్షం నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం బెల్లంప‌ల్లిలోని కాంగ్రెస్ కార్యాల‌యంలో అఖిల‌ప‌క్ష నేత‌లు స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రెడ్డి ర‌త్న‌మ్మ మ‌ర‌ణించ‌డంతో తాము చేసిన ఆందోళ‌న ఫ‌లితంగా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యురాలైన‌ స్వరూప రాణిపై ఛార్జి షీట్, సస్పెండ్, బదిలీ చేస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి సింగరేణి యాజమాన్యం సస్పెండ్, బదిలీ నిలిపి వేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గుర్తింపు సంగానికి యాజమాన్యం తొత్తులుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నించారు. కార్మికుల కుటుంబ సభ్యులు వైద్యం అందక మరణిస్తే కార్మికుల పక్షాన నిలబ‌డాల్సింది పోయి యాజమాన్యతొత్తులు గా వ్యవహరించడం బాధాకరమ‌న్నారు. రెడ్డి రత్నమ్మ మరణానికి కారణమైన స్వరూప రాణి పై చర్యలు తీసుకోకపోతే అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ రోజు సమావేశంలో తీర్మానించారు. స‌మావేశంలో టీపీసీసీ కార్య‌ద‌ర్శి మత్తమరి సూరిబాబు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ SCCL ఉపాధ్యక్షులు మంతెన కొమురయ్య, బర్రె మధునయ్య, సేవా దళ్ జిల్లా చైర్మన్ బండిరామ్, మాజీ టౌన్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య యాదవ్, AITUC కేంద్ర నాయకులు చిప్పనర్సయ్య, టౌన్ కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, దాగం మల్లేష్, రత్నం ఐల్లయ్య, రత్నం రాజం, రాంచందర్, YSR TP నాయకులు కాశి సతీష్ కుమార్, టీడీపీ నేత‌లు మణీరామ్ సింగ్, గంగాధర్ గౌడ్,మచ్చయ్య, HMS నాయకులు ఖాదర్ ఖాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like