యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి

-కార్మికుల సమస్యలు పరిష్కరించాలి8 -లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన

రామగుండం ఏరియా ఓసిపి త్రీ కార్మిక సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ఆర్ జి టు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ ఆరోపించారు. ఓసిపి త్రీ పని స్థలాలను సందర్శించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడం వల్ల దుమ్ము అరికట్టడం సాధ్యం కావడం లేదన్నారు. దీని వల్ల ఆపరేటర్లు, ఇతర కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకర్లు అన్ని సరైన పర్యవేక్షణ లేక మరమ్మతు కోసం వర్క్ షాప్ పంపించారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పనిచేయడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. అదే రకంగా సర్ఫేస్ ఫీడర్ లో డంపర్ లోని బొగ్గును మంటలను ఆర్పకుండానే ఫీడర్ల లో వేస్తున్నారని చెప్పారు. దానివలన తీవ్రమైన దుమ్ము ధూళి స్మోక్ వస్తోందని తెలిపారు. పైలెట్ పార్టీలో తీవ్రమైన మంటలు చెలరేగుతూ పొగ రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఈ విషయాలను ఓ సి పి త్రీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి బేతి చంద్రయ్య సమ్మయ్య సూర్య శ్యామ్ రంగి శెట్టి వెంకన్న భీముని సత్యనారాయణ చేరాలు కార్మికులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like