తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

BRS MLA:బీఆర్ఎస్ ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్న ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు షేజల్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. తనను ఎంఎల్ఏ మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారని, ఆయన అనుచరులు సైతం వేధిస్తున్నారని నాలుగు రోజులుగా ఢిల్లీ లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు.

ఢిల్లీ తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో శేజల్ విషం తాగారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు ఈ సందర్భంగా ఆమె ఒక లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఇది…

గౌరవనీయులైన న్యాయమూర్తులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మిత్రులకు నా విన్నపం.

MIA దుర్గం చిన్నయ్య, వారి అనుచరులైన భీమాగౌడ్, చిల్లరపు సంతోష్, కుమ్మరి పోచన్న, కొనుకి కార్తీక్ నన్ను కొంత కాలంగా మానసికంగా రకరకాలుగా హింసిస్తున్నారు. MIA దుర్గం చిన్నయ్య నన్ను వేదిస్తూ వాళ్ళ అనుచరులతో చంపుతాని బెదిరిస్తుండటంతో నేను ఢిల్లీ వచ్చి నిరసన తెలిజేస్తున్నాను. రెండు రోజుల నుండి MIA అనుచరులు సోషల్ మీడియాలో నా ఫోటోలను మార్పింగ్ చేస్తూ నా గురించి అసభ్యకరమైన వార్తలు వేస్తున్నారు నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. గోలి శివ, ఇంకో వ్యక్తి నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతా అని బెదిరిస్తున్నారు. నేను పలుమార్లు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నా కేసులను నమోదు చేయకపోగా తప్పుడు కేసులో తిరిగి నా మీది పెడితూ నన్ను చిత్ర హింసకు గురిచేస్తున్నారు.

విజ్ఞప్తి : నేను చనిపోయిన తర్వాత అయిన నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ నేను ఈ సూసైడ్ లెటర్ రాస్తున్నాను.

Get real time updates directly on you device, subscribe now.

You might also like