మీ ఫోన్ రంగులు మారుస్తుంది..

Your phone will change colors: అవును మీరు విన్న‌ది నిజ‌మే… మొద‌ట్లో కేవ‌లం మాట్లాడుకోవ‌డానికే ప‌రిమితం అయిన ఫోన్లు రోజుకో కొత్త ర‌క‌మైన ఫీచ‌ర్లు, స్పెసికేష‌న్ల‌తో అద‌ర‌గొడుతున్నాయి. చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్ప‌త్తుల కంపెనీ Vivo మ‌రో కొత్త ఫోన్ విడుల చేసింది. Vivo V25 5G పేరుతో కొత్త మోడ‌ల్‌ను భార‌త మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ అనేక గొప్ప ఫీచ‌ర్ల‌తో వ‌స్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో 64-మెగాపిక్సెల్ OIS నైట్ కెమెరా అందిస్తున్నారు. అంతేకాకుండా, బ్యాక్‌సైడ్ రంగు మారే ఫ్లోరైట్ AG బ్యాక్ ప్యానెల్ తో రూపొందించారు.

భారతదేశంలో Vivo V25 5G మొబైల్స్ ర్యామ్, ఇంట‌ర్న‌ల్‌ స్టోరేజీ కెపాసిటీల ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. బేస్ వేరియంట్‌, 8GB RAM+ 128GB స్టోరేజ్ ధ‌ర‌ల‌ను రూ. 27,999గా 12GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధ‌ర‌ను రూ.31,999 గా నిర్ణ‌యించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎలిగెంట్ బ్లాక్ సర్ఫింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ , వివో ఇ-స్టోర్‌లో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంచారు.

Vivo V25 5G ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఉంటుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh సామ‌ర్థ్యం ఉన్న‌ బ్యాటరీతో వ‌స్తోంది. సూర్యకాంతి లేదా UV కిరణాల ప‌డిన‌పుడు బ్యాక్ ప్యానెల్ రంగు మారే ఫీచ‌ర్ దీనికి అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న రీతిలో క‌న‌పడుతుంద‌ని త‌యారీదారులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like