పార్టీ నీ జాగీరనుకున్నావా…?

ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారు
అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం
హాజీపూర్ జడ్పీటీసీ పూస్కూరి శిల్ప

ZPTC: ఎమ్మెల్యే తమపై కుట్ర పన్నారని, కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా హాజీపూర్ జడ్పీటీసీ పూస్కూరి శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని కొడుకు విజితపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆది వారం మంచిర్యాల ఐబీ గెస్ట్ హౌజ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుండగా స్టేజీపైర్ తమని రాకుండా అడ్డుకున్నారని అన్నారు. తమకు పాసులివ్వకుండా కావాలనే ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. మహిళా ఖడ్పీటీసీని అని చూడకుండా అవమానించాడని దుయ్యబట్టారు. ఊరూర తిరుగాలని తమపై ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి సైతం తమని పిలువలేదన్నారు. ఈ విషయంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు తీసుకెళ్లామన్నారు. హాజీపూర్కు మెడికల్ కళాశాల కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఎమ్మెల్యే తన స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు. హాజీపూర్ మెడికల్ కళాశాల ఇవ్వమని ఎమ్మెల్యే చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించాల్సిన మెడికల్ కళాశాలను తిరిగి గోదావరి ఒడ్డున కట్టే ప్రయత్నం చేశారన్నారు. దీనితో తాము మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించి ఇక్కడే మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చూశారన్నారు. దానిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. పార్టీ నా సొంతం, నా కొదుకు సొంతం అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎన్నో దానధర్మాలు చేసిందని, ఎమ్మెల్యే గుంట భూమి ఇచ్చారా? అని నిలదీశారు. హాజీపూర్లో రాంపూర్ శిశు మందిర్ కోసం 18 ఎకరాలు, పోలీస్ స్టేషను, ప్రభుత్వ దవాఖానకు భూములు ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేపై అదిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like