మూడు కార్పొరేష‌న్ల‌ను చైర్మ‌న్ల నియామ‌కం

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం ఒకేసారి మూడు కార్పొరేష‌న్ల‌ను చైర్మ‌న్లు నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆమోదం మేర‌కు వీరిని నియ‌మించారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి,డైరెక్టర్లుగా హైదరాబాద్ కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ్ పేట్ జిల్లా, మద్దూర్ మండలం రెనెవట్ల కు చెందిన మొహమ్మద్ సలీంను నియమించారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి కి చెందిన మాటం బిక్షపతి ని నియమించ‌గా, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన మొహమ్మద్ తన్వీర్ ను నియమించారు. వీరు ఈ ప‌ద‌వుల్లో రెండేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు.

You might also like