రూ 2.25 కోట్ల గంజాయి స్వాధీనం

వివ‌రాలు వెల్ల‌డించిన ఎస్పీ గౌష్ ఆలం

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నార‌రు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద రూ. 2.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న‌ట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం వెల్ల‌డించారు. పెద్ద ఎత్తున గంజాయి తరలుతోందని పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండ‌గా, ఉత్తరాఖండ్ కు చెందిన ఒక ఐచర్ కంటైనర్ వాహనం నంబర్ (UK 08 CB5318) ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లగా పోలీసుల ఆ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు. అందులో డ్రైవర్ క్లీనర్లు ఉన్నారు. పోలీసులు వారిని ప్రశ్నించగా డ్రైవర్ వసీమ్, క్లీనర్ అర్మాన్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కు చెందిన అన్షు జైన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన పండిత్ జి, సోను అన్సారి త‌దిత‌రుల‌కు మూడు సంవత్సరాలుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్, సుక్మా, జగదల్ పూర్ అటవీ ప్రాంతం నుండి చాలాసార్లు తన వాహనంలో గంజాయిని తీసుకువచ్చి పై ముగ్గురికి ఇచ్చారు. గంజాయిని తెచ్చి వారికి ఇచ్చినందున వారు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేవారు.

పది రోజుల కింద‌ట‌ పండిత్ జీ, అతనికి పరిచయమైన ఆశిష్, ఆంధ్ర ఆడిషా బార్డర్ అటవీ ప్రాంతంలో 900 కిలోల గంజాయి మహారాష్ట్ర బుల్దానా జిల్లాకు చెందిన వారికి, మాలే జిల్లాకు చెందిన వారికి గంజాయి అవసరం ఉంద‌ని రూ 1,50,000/ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీనికి వసీం ఒప్పుకొని క్లీనర్ అయిన అర్మాన్ కు కూడా విషయం చెప్పి ఐచర్ వాహనంలో దానిని త‌ర‌లించే ఏర్పాట్లు చేశారు. వసీం గంజాయి నింపుకుని వరంగల్ కరీంనగర్ మీదుగా మహారాష్ట్రలోని బుల్దానాకు వెళుతున్న స‌మ‌యంలో ఆదిలాబాద్లో పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు వాటిని తూకం వేయ‌డంతో దాదాపు 900 కిలోల వరకు గంజాయి ఉంది. గంజాయి మార్కెట్ విలువ రూ. 2 కోట్ల 25 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

నిందితులు
A1) ఆశిష్, మల్కాన్ గిరి, ఒడిస్సా రాష్ట్రం, ముఖ్యమైన సప్లయర్. (పరారీ)
A2) పండిత్ జి, కసంపూర్ మీరుట్, ఉత్తరప్రదేశ్,(పరారీ)
A3) వసీం @వసీం అన్సారి, ఉత్తర ప్రదేశ్, కంటైనర్ లారీ డ్రైవర్. (అరెస్ట్)
A4) అర్మాన్, ఉత్తర ప్రదేశ్, కంటైనర్ లారీ క్లీనర్. (అరెస్ట్)
A5), A6) గుర్తుతెలియని వ్యక్తులు బుల్దాన, దూలే జిల్లా, మహారాష్ట్ర చెందిన వ్యక్తులు. (పరారీ)
A7) అన్షు జైన్,(పరారీ) ఉత్తరాఖండ్.
A8) సోను అన్సారి, (పరారీ)

ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం జిల్లాలో ఇదే మొదటిదని పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు అరెస్టు చేయడంలో, కేసు నమోదులో కీలకపాత్ర పోషించిన ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి సురేందర్ రెడ్డి అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ ఎస్సైలు అంజమ్మ, ముజాహిద్, విష్ణువర్ధన్ సిసిఎస్ రూరల్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, నగదు బహుమతి అందించి ప్రోత్సహించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like