అభివృద్ధిలో వెనకడుగు లేదు

-ప్రజాప్రయోజల కోసమే మార్కెట్ భవనం కూల్చివేత
-అభివృద్ధి ఓర్వలేక ఆరోపణలు
-నవంబర్లో సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం
-మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాప్రయోజనాల కోసమే నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ భవనం కూల్చివేసినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పునరుద్ఘాటించారు. గురువారం ఐబీ స్థలంలో మార్కెట్ కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అక్కరకు రాని మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్లో ఆసుపత్రి నిర్మాణం పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలుపెడితున్నాయని విమర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యశాల నిర్మిస్తే ప్రతిపక్షాలకు వచ్చిన చిక్కు ఏమిటో స్పష్టం కావడం లేదని అన్నారు. ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లకుండా మంచిర్యాలలో వైద్యం అందించేందుకు కృషి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు కంటగింపుగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వ అతిథి గృహం లేకుండా పోయిందని వాపోవడం విడ్డురంగా ఉందని అన్నారు. మంత్రులు వస్తే నా ఇంట్లో ఆతిత్యం ఇస్తానని అన్నారు. తన పేరు కనుమరుగు చేయడానికి కుట్రపన్నుతున్నానని ఆరోపించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నికల్లో ఓడించి పేరు ఇంట్లో కూర్చోపెట్టారని తెలిపారు. పేరు చేరగకుండా ఉండడానికి ఆయన గాంధీ, నేతాజీ లాంటి ఉత్తమ నేత కాదని హితవుపలికారు. ప్రజలు, దేవుని ఆశీస్సులు తో ఎన్నికల్లో గెలుపొంది అభివృద్ధి కి బాటలు వేస్తున్నానని అభివృద్ధి విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తి లేదని ఎలాంటి కేసులను ఎదుర్కోవడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కూరగాయల మార్కెట్లో కొత్త భవనం నిర్మాణం ఎందుకు చేయలేదో దివాకర్ రావు ప్రజలకు జవాబు చెప్పాలని నిలతీశారు. గోదావరి పై అంతర్ గాం బ్రిడ్జి నిర్మాణం స్వార్థంతో చేపట్టింది తప్ప ఒక ప్రణాళిక లేదని ఆరోపించారు. ప్రతిపక్షాలు చేసే ప్రతి ఆరోపణలకు అభివృద్ధి, సంక్షేమం ద్వారా జవాబు చెబుతానని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like