బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Female student commits suicide in Basara IIIT: బాసర త్రిబుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రావడం తెలియడం లేదు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థిని శవాన్ని ఆసుపత్రికి తరలించారు.

You might also like