గ‌నుల‌పై జనక్ ప్రసాద్ జ‌న్మదిన వేడుక‌లు

ఐఎన్‌టీయూసీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మందమర్రి ఏరియా KK5 గనిలో ఐఎన్‌టీయూసీ శ్రేణులు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ జనక్ ప్రసాద్ ఐదు దశాబ్దాలుగా కార్మిక సేవలో నిమగ్నమైన మహోన్నత నాయకుడన్నారు. ఆయ‌న నాయకత్వంలో సింగరేణి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి జ‌రుగుతోంద‌న్నారు. తాడిచెర్ల=2 గని సింగరేణి సాధించుకోవడం, మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ ను సైతం సాధించుకున్న‌ట్లు చెప్పారు.

డిపెండెంట్ ఉద్యోగుల వయసు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడ‌మే కాకుండా, దాదాపు 2,000 మందికి నూతన ఉద్యోగాలను ఇప్పించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. కార్మిక కుటుంబాల రక్షణ కోసం కోటి 20 లక్షల రూపాయల విలువైన ప్రమాద బీమాను ప్రవేశపెట్టడం, భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా మొట్టమొదటిసారిగా సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాను ఇప్పించిన ఘనత కూడా జనక్ ప్రసాద్ దేన‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా, వారికి 40 లక్షల రూపాయల ప్రమాద బీమాను సైతం వర్తింపజేసేలా కృషి చేశారని వెల్ల‌డించారు.

ఆయ‌న‌ నాయకత్వంలో కోయగూడెం సత్తుపల్లి బ్లాక్‌, మందమర్రి ఏరియా శ్రావణపల్లి ఓసీ, KK6 గనితో పాటు మాదారం గోలేటి ఓసీలు, చెన్నూరు సౌత్ బ్లాక్‌ తదితర గనుల సాధనకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మైసమ్మ తల్లికి ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించారు. గని పిట్ సెక్రటరీ భీమారపు సదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పిట్ సెక్రటరీ హనుమాన్ల రాజేంద్రప్రసాద్ నాయకులు కృష్ణమోహన్, కలమండ స్వామి, రణవేణ రాజకుమార్, నాగరాజు, రాజేందర్, కండె రాజ్ కుమార్, రమేష్, రవి, సంపత్, విజయ్, కొమరయ్య, జమ్ల నాయక్, శాంతి కుమార్, రమేష్ నాయక్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

You might also like