రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

Green signal for trains:పెద్దపల్లి జిల్లా రాఘవాపురం – రామగుండం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి అప్‌లైన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. రాఘవపురం – రామగుండం మధ్య గూడ్స్‌ రైలు విజయవంతంగా నడిపించారు. అప్ లైన్ క్లియర్ కావడంతో రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఘటన జరిగిన దాదాపు 23 గంటల తర్వాత రైలును నడిపించారు. మరికొద్ది గంటల్లో డౌన్‌ మార్గం సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. రామగుండం రాఘవపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి ఘజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రామగుండం రాఘవపూర్, మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

You might also like