ఫారెస్టోళ్ల‌తో కొట్లాడినా..

MLA Vinod: ప్ర‌జ‌ల అభివృద్ధి కోస‌మే కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆలోచిస్తుంద‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌యానికి వెళ్లే నూత‌న రోడ్డు ప‌రిశీలించారు. సీ సంద‌ర్భంగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రజల కోరిక మేరకు ప్రేమతో అభివృద్దికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి అభివృద్ది పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించామ‌న్నారు. వేమనపల్లి, చెన్నూరు రోడ్డు నిర్మించేలా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సహకరించాలన్నారు.

అభివృద్ధి ప‌నుల విష‌యంలో అటవీశాఖ అధికారులతో కొట్లాడానని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మూడు జూనియర్ కళాశాలలు మంజూరు చేయించి స్థలాలు కేటాయిస్తున్నామ‌ని, ఈ వ్య‌వ‌హారంలో జిల్లా కలెక్టర్ తో చర్చించానని ఆయ‌న వెల్ల‌డించారు. బుగ్గ రోడ్డును బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నానని స్ప‌ష్టం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ 40 ఏండ్ల క‌ష్టాలు తీరేలా బుగ్గ జాత‌ర‌కు రోడ్డు వేయించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. బెల్లంప‌ల్లి అభివృద్ధి విష‌యంలో ఎమ్మెల్యే వినోద్ ఉత్సాహంగా ఉన్నార‌ని అన్నారు.

You might also like