కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల కాలేజీ రోడ్డు పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణం అవుతున్న సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్ సంస్థ) ఆధ్వర్యంలో ఈ వంటశాల రూపుదిద్దుకుంటోంది.
దీనిని ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, కార్పొరేటర్లు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..