అడ్వకేట్ల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అడ్వకేట్స్ మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్ జట్లు పోటీపడ్డాయి. న్యాయవాదుల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య, గడ్డం శ్రీనివాస్, చుంచు సదానందం, సురేంద్ర ఉపాధ్యాయ, నిశాంత్ గాంధీ, తుల ఆంజనేయులు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.