రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి. అతన్ని 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడెంకు చెందిన హనుమంతు(అంజి) బైక్ పై వెళ్తున్నాడు. తాండూరు ఐబీ నుంచి మొర్రిగూడెం వెళ్తుండగా నీలాయపల్లి వద్ద బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో హనుమంతుకు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

You might also like