పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి.. ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
పేకాట స్థావరంసై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంపేటలో పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలోని నార్కోటిక్/టాస్క్ఫోర్స్ సిబ్బంది శనివారం పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,730 నగదు, 52 పేకముక్కలు,6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో… ధర్మాజీ లక్ష్మణ్, లాయిశెట్టి మహేష్, బంగారి నారాయణ, ఆదిచర్ల శివ సాయి, మెరుగు వెంకటస్వామి, మాచర్ల ఆకాష్, ఆసర్ల మల్లేష్ ఉన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రూ.14,730 నగదు, 6 సెల్ఫోన్లను అంతర్గాం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం, నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.