చేతబడితోనే పాకిస్తాన్ ఓడిపోయింది..
ICC Champions Trophy 2025: అదన్నమాట అసలు సంగతి… పాకిస్తాన్ టీం అసలు కప్పు గెలవాల్సి ఉండే… కానీ, చేతబడి పుణ్యమా అని ఓడిపోయిందట.. కొందరు పండితులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేతబడికి సంబంధించిన పూజలు చేయడంతో ఆ టీం ఓడియింది… ఇదీ పాకిస్తాన్‌లో కొందరి వాదన.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వార్త….
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి పాకిస్తాన్ చానల్ ఓ చర్చ నిర్వహించింది. ‘ఛాంపియన్స్ క్లాష్స్’ పేరిట నిర్వహించిన ఈ చర్చలో పాల్గొన్న విశ్లేషకులు తేల్చింది ఏంటయా అంటే భారత్‌తో మ్యాచ్ సందర్భంగా చేతబడి చేశారని అందుకే పాక్ జట్టు ఓడిపోయిందని తేల్చేశారు. అందులో ఒక విశ్లేషకుడు చెప్పిన విషయం ఇదీ.. భారత్‌కు చెందిన 22 మంది పండితులను దింపిందని నాకు సమాచారం వచ్చింది. ఒక్కో ప్లేయర్ కోసం ఇద్దరు పండితులు చేతబడి చేశారు. ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ ప్లేయర్లు ఏకాగ్రత కోల్పోతారు. డిస్టర్బ్ అవుతారు. ఆ విధంగా పండితులంతా కలిసి పాకిస్తాన్ జట్టుపై చేతబడి చేశారు. అందుకే పాకిస్తాన్ ఈ విధంగా చిత్తుగా ఓడిపోయిందని చెప్పారు.
ఆ పండితులు పాకిస్తాన్ రావడానికి ఇష్టపడరు కాబట్టి… చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో పెట్టించారు. పండితులు పాకిస్తాన్ వస్తే పండితులతో చేతబడి చేసే అవకాశం ఉండదు కాబట్టి … ఒక వేళ చేసినా వాళ్ల చేతబడి పనిచేయదు. 2024లో కూడా ఇలాగే చేశారంటూ చెప్పుకొచ్చారు. దుబాయికి భారత జట్టు రావడానికి ముందే, ఈ పండితులు దుబాయ్ కి వచ్చారు. భారత జట్టు, దుబాయ్లో అడుగుపెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశారని ఆ విశ్లేషకులు వెల్లడించారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హార్దిక్ పాండ్యా, చేతులకు మంత్రాలు చదువుతున్నట్టుగా చేయడం చూశాం. అతను కూడా మంత్రగాడే మంత్రాలు తెలుసు కాబట్టే అలా చేసి, వికెట్ తీశాడు అంటూ అందులో విశ్లేషించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.